ఇఇఎఫ్‌ఐ నూతన కమిటీ ఎన్నిక

Mar 12,2025 22:40 #EEFI new committee, #elected
  •  అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుగా ఎలమరం కరీం, సుదీప్‌ దత్తా
  • ఘనంగా ఇ.ఇ.ఎఫ్‌.ఐ 10వ మహాసభ

తిరువనంతపురం : ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఇఇఎఫ్‌ఐ) నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ఎలమరం కరీం, సుదీప్‌ దత్తా ఎన్నికయ్యారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో సోమవారం నుంచి బుధవారం వరకూ జరిగిన ఫెడరేషన్‌ 10వ మహాసభకు వివిధ రాష్ట్రాల నుండి 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత ఇఇఎఫ్‌ఐ అధ్యక్షులు ఎలిమరం కరీం జెండా ఆవిష్కరించారు. సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ ప్రారంభోపన్యాసం చేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన ట్రేడ్‌ యూనియన్‌ అంతర్జాతీయ విద్యుత్‌ రంగం నాయకులు, ఎంపిహెచ్‌ఒ ఫకేడీ అడ్విన్‌, ఎఐఎఫ్‌ఇఇ ప్రధాన కార్యదర్శి మోహన్‌ శర్మ మహాసభలో సౌహార్ద సందేశం ఇచ్చారు. ఫెడరేషన్‌ జాతీయ నాయకులు స్వదేశ్‌ దేవరాయి, రాజేంద్రన్‌, లంబా, గోవర్దన్‌, దీపా తదితరులు పాల్గొన్నారు మొదటి రోజు సాయంత్రం 4 గంటలకు తిరువనంతపురంలో బహిరంగ సభ జరిగింది. ఇఇఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి ప్రశాంత నంద చౌదురి, సుదీప్‌ దత్తా, సురేష్‌ లంబా ప్రవేశపెట్టిన నివేదికపై పలు రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం మహాసభ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎలమరం కరీం, సుదీప్‌ దత్తా, కోశాధికారిగా రాజేంద్రన్‌ను ఎన్నుకుంది.

ఆంధ్ర ప్రదేశ్‌ నుండి ఎన్నికైన ప్రతినిధులు

జాతీయ ఉపాధ్యక్షులుగా యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ బి-1829) నుండి యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు డి.సూరిబాబు, వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సుదర్శన రెడ్డి, కౌన్సిల్‌ సభ్యులుగా యూనియన్‌ కోశాధికారి ఎల్‌.రాజు ఎన్నికయ్యారు. యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ నుండి యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జె.రాజశేఖర్‌, వర్కింగ్‌ కమిటీ సభ్యులు బి.సుమన్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు.

➡️