Encounter : జమ్ముకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి

శ్రీనగర్‌ :  జమ్ముకాశ్మీర్‌ బారాముల్లాలో  గురువారం అర్థరాత్రి  జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. వారిని గుర్తించాల్సి ఉందని   కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు ఎక్స్‌లో పేర్కొన్నారు. వారి నుండి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిఘా వర్గాల సమాచారం మేరకు గురువారం సాయంత్రం భద్రతా బలగాలు కూంబింగ్‌ చేపడుతుండగా  ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

➡️