న్యూఢిల్లీ : అవామీ ఇత్తెహాద్ పార్టీ నేత, బారాముల్లా ఎంపి ఇంజనీర్ రషీద్ సోమవారం జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ కోర్టు వాయిదా వేయడంతో సోమవారం మధ్యాహ్నం తీహార్ జైలుకి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం అదనపు సెషన్స్ జడ్జి చందర్‌జిత్ సింగ్ సెప్టెంబర్ 10న రషీద్‌కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే సాధారణ బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేశారు. రషీద్ తండ్రి అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్‌ను అక్టోబర్ 28 వరకు పొడిగించింది.
ఉగ్రవాదులకు నిధుల చేరవేసిన అభియోగాలపై ఉపా చట్టం కింద అరెస్టయిన రషీద్ 2019 నుండి తీహార్ జైలులో ఉన్నారు.