పంజాబ్‌లో పంట వ్యర్థాల కాల్పులు తగ్గినా.. ఢిల్లీలో కాలుష్యం తగ్గలేదు

Oct 28,2024 18:46 #Punjab

చండీగఢ్‌ : ఢిల్లీలో వాయుకాలుష్యం పెరగడానికి పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దగ్ధమే కారణమని ఢిల్లీ ప్రభుత్వంతోపాటు, కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి కూడా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పంజాబ్‌లో పంట వ్యర్థాల దగ్ధం 50 శాతం మేర తగ్గినా.. ఢిల్లీలో వాయుకాలుష్యం తగ్గలేదు. గత సంవత్సరం పంజాబ్‌లో అక్టోబర్‌ 15 నుంచి 27 వరకు 4,059 ఫైర్‌ కేసులతో పోల్చితే.. ఈ ఏడాది కేవలం 1,995 పంట దగ్ధాల కేసులు నమోదయ్యాయని పంజాబ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ వెల్లడించింది. 2022తో పోల్చితే.. ఈ ఏడాది 75 శాతం మేర వ్యర్థాలను కాల్చడం తగ్గింది. 2022లో 8,147 ఫైర్‌ కేసులు నమోదయ్యాయి.

➡️