ప్రతి దాడి మమ్మల్ని మరింత బలపరుస్తుంది

  • ముడుపుల ఆరోపణలపై నోరు విప్పిన అదానీ

న్యూఢిల్లీ: రెండు వారాల కిందట అమెరికా న్యాయశాఖ తనపై చేసిన ఆర్థిక నేరాభియోగాలపై అదానీ గ్రూపు సంస్థల అధినేత, వివాదాస్పద వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ ఎట్టకేలకు నోరు విప్పారు. అమెరికా చేసిన ఆరోపణలు నిరాధారమైవని, వాటిని కోర్టులో సవాల్‌ చేసే అంశం పరిశీలిస్తానని చెప్పారు. ఇటువంటి దాడులు తమపై జరగడం ఇదే మొదటి సారి కాదని, ఇలాంటివి ఇంతకుముందు కూడా ఎదుర్కొన్నామని అంటూ, ”ప్రతి దాడి మమ్మల్ని మరింత బలోపేతం చేస్తుంది” అని ఆయన సెలవిచ్చారు. జైపూర్‌లో శనివారం నిర్వహించిన ఓ అవార్డుల వేడుక కార్యక్రమంలో ఆయన ఆన్‌లైన్‌లో పాల్గొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూపు సంస్థలు సోలార్‌ ప్రాజెక్టు టెండర్లను చేజిక్కించుకోడానికి, భారత్‌లో రూ. 2029 కోట్ల మేర ముడుపులు ముట్టచెప్పారని న్యూయార్క్‌ కోర్టులో అభియోగం మోపిన సంగతి తెలిసిందే.

➡️