ఢిల్లీ : లిక్కర్ స్కాం కేసులో నిందితురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులపాటు పొడిగించింది. నేటితో ఆమె జ్యూడీషియల్ కస్టడీ ముగియగా.. తీహార్ జైలు నుంచి ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే కస్టడీ పొడిగించాలంటూ ఇటు ఈడీ, అటు సీబీఐ కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది. ఈ క్రమంలో కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ కోర్టుకు అందజేసింది. అంతేకాదు 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జిషీట్ సమర్పిస్తామని ఈ సంద్భంగా ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో.. మే 7
