వక్ఫ్‌ బోర్డు బిల్లుపై జెపిసి కాల పరిమితి పొడిగింపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) కాల పరిమితి 2025 బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు వరకు పొడిగించారు. గురువారం లోక్‌సభలో జెపిసి ఛైర్మన్‌ జగదాంబికా పాల్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వీలైనంత ఎక్కువ మంది భాగస్వామ్యంతో ఏకాభిప్రాయం సాధించడానికి కాల పరిమితిని పొడిగించాల్సిన అవసరముందన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఢిల్లీలోనే 147 మంది ప్రతినిధులతో జెపిసి 29 సమావేశాలు నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్మానంపై చర్చ జరిపిన అనంతరం మూజువాణీ ఓటుతో సభ ఆమోదించింది.

➡️