కోల్కతా: లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా పశ్చిమ బెంగాల్లో బిజెపి అభ్యర్థి ఒకరు వికృత చేష్టకు పాల్పడ్డాడు. ప్రచార సమయంలో ఒక యువతి బుగ్గపై ఆయన ముద్దు పెట్టారు. ఉత్తర మాల్దా లోక్సభ స్థానం నుండి బిజెపి తరపున పోటీ చేస్తున్న ఖగేన్ ముర్మూ శిహ్రిపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. యువతిని పట్టుకుని ముద్దు పెట్టిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ముర్మూపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ‘మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీలు.. బెంగాలీ మహిళలపై అసభ్యకర పాటలు రాసే నేతలు.. ఇలాంటి జాలాయిలకు కొదవలేదు. మహిళలకు ‘మోడీ పరివార్’ ఇస్తున్న గౌరవం ఇది.
