న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు పడిపోయాయి. శనివారం ఉదయం 7 గంటల సమయానికి 349 వద్ద ఎక్యూఐ నమోదైందని, ‘వెరీ పూర్’ కేటగిరీలో వర్గీకరించినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. ఢిల్లీలోని అలీపూర్ 351, బురారి 351, డిటియు 377, ఐటివో 328 వద్ద ఎక్యూఐ నమోదైందని, గాలి నాణ్యతలు తీవ్రస్థాయిలో పడిపోయాయని సిపిసిబి పేర్కొంది.
కాగా, గాలి నాణ్యతలు పడిపోవడంతో ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. దృశ్యమానత తగ్గింది. స్థానికులు కళ్ల మంటలు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు.