మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

May 16,2024 07:26 #Madhya Pradesh, #road accidents

8మంది మృతి 

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో బుధవారం అర్థరాత్రి రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రూపేష్ కుమార్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘటాబిల్లోడ్ సమీపంలో జీపు గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. “ఎనిమిది మంది మరణించినట్లు ధృవీకరించబడింది, మరొక వ్యక్తి గాయపడ్డాడు” అని అధికారి తెలిపారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత గుర్తు తెలియని వాహనం డ్రైవర్ పరారయ్యాడని ద్వివేది తెలిపారు.

➡️