మధురలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు సజీవదహనం

మధుర (ఉత్తరప్రదేశ్‌) : ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం రాత్రి జరిగింది. మధురలోని మహావన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి మైల్‌ స్టోన్‌ 116 వద్ద ఈ ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై 40 మందితో ప్రయాణిస్తున్న బస్సును, కారు ఢీకొట్టడంతో ఐదుగురు సజీవదహనమయ్యారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మరణించగా.. బస్సులో ఒకరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. బస్సు బీహార్‌ నుంచి ఢిల్లీ వైపుకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ బస్సులో ఉన్న మిగతావారందరు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై సిఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. మఅతుల కుటుంబాలకు సిఎం యోగి సంతాపం తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

➡️