నేడు తీరం దాటనున్న ఫెంగల్‌

  • తమిళనాడులోని ఏడు జిల్లాలకు హెచ్చరికలు
  • స్కూళ్లకు సెలవు, పరీక్షల వాయిదా 
  • పలు జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌

చెన్నై : ఫెంగల్‌ తుపాను శుక్రవారం మధ్యహ్నాం తమిళనాడులోని మమల్లపురం (మహాబలిపురం), కరైకల్‌ (పుదుచ్చేరి) మధ్య తీరం దాటనుందని చెన్నైలో ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ ప్రభావంతో తమిళనాడులోని ఏడు తీర ప్రాంతా జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం చెన్నరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం వరకూ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70 -80 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని డెల్టా, ఉత్తర కోస్తా జిల్లాలో 24.4 సెంమీలకు పైన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్‌ ఎలర్ట్‌ జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసిన సమాచారం ప్రకారం ఆ సమయానికి ఫెంగల్‌ తుపాను బంగాళాఖాతంలో చెన్నైకు 480 కిమీ, నాగపట్నానికి 310 కిమీ దూరంలోనూ ఉన్నట్లు తెలిపింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలపై కదులుతున్నట్లు తెలిపింది. శనివారం మధ్యహ్నానికి తీరం దాటుందని, తమిళనాడులోని ఏడు జిల్లాలు పుదుచ్చేరిలోనూ భారీ లేదా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. ముందుజాగ్రత్త చర్యగా విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించింది.

➡️