ఆ రేవ్‌ పార్టీలో సినీ నటి హేమ కూడా : సిపి దయానంద్‌

May 21,2024 15:22 #Actress Hema, #police case, #Rave Party

బెంగళూరు : బెంగళూరులో పోలీసులు ఓ రేవ్‌ పార్టీని భగం చేయడం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌ మీడియాకు తెలియజేశారు. ఈ రేవ్‌ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు అని వెల్లడించారు. ఈ రేవ్‌ పార్టీకి ‘సన్‌ సెట్‌ టు సన్‌ రైజ్‌ విక్టరీ’ అని పేరుపెట్టారని తెలిపారు. ఈ పార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీ నటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. అయితే, తాను ఈ పార్టీలో పాల్గొనలేదని, సొంత ఫాంహౌస్‌లోనే ఉన్నానంటూ హేమ విడుదల చేసిన వీడియో ఎక్కడ రికార్డ్‌ చేశారన్నదానిపై విచారణ జరుపుతున్నామని సీపీ వివరించారు. ఈ పార్టీలో పాల్గొన్నవారిలో ఐదుగురిని అరెస్ట్‌ చేశామని, ఇందులో ప్రజాప్రతినిధులు ఎవరూ పాల్గొనలేదని వెల్లడించారు.

➡️