ముంబై : ఈ నెల 23వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో మహాయతి కూటమి ఘన విజయం సాధించింది. అందులోనూ బిజెపి 100 మార్క్‌ను దాటి సీట్లను గెలుకుంది. ఈ నేపథ్యంలో బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్‌నే ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. కానీ ఆ కూటమిలో నేతలే ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు సిఎం పదవికి పోటీ పడడంతో.. కొత్త సిఎం ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఫలితాలనంతరం మహాయతి కూటమి నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పలుమార్లు చర్చలు జరిపారు. రోజులు గడుస్తున్నా.. సిఎం పదవిపై ఇంతవరకూ స్పష్టత రాలేదు. అయితే ఫడ్నవీస్‌కే బిజెపి అధిష్టానం ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే యోచనల్లో ఉన్నట్లు సమాచారం. ఏక్‌నాథ్ షిండేకి హోంశాఖ, అజిత్ పవార్‌కు ఫైనాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.