మధురలోని ఇండియన్‌ ఆయిల్‌ రిఫైనరీలో అగ్నిప్రమాదం

లక్నో : యుపిలోని మధురలో ఇండియన్‌ ఆయిల్‌ రిఫైనరీలో అగిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. ఏడాదికి 8 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల (ఎంటిపిఎ) చమురునే అందించే మధుర రిఫైనరీలోని క్రూడ్‌ డిస్టిల్లిషన్‌ యూనిట్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని ఇండియన్‌ ఆయిల్‌ కార్ప్స్‌ (ఐఒసి) ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ప్లాంట్‌, యంత్రాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని, రిఫైనరీ కార్యకలాపాలు యథావిథిగా కొనసాగుతున్నాయని తెలిపింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది.

రిఫైనరీల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఈ వారం ఇది రెండవ ఘటన. సోమవారం ఉదయం గుజరాత్‌లోని రిఫైనరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడిన సంగతి తెలిసిందే.

➡️