టీఎంసీ కౌన్సిలర్‌ను దుండగులు కాల్చి చంపిన ఘటన మరువక ముందే ఇద్దరు టీఎంసీ నేతలపై కాల్పులు జరగడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం కలియాగంజ్ ప్రాంతంలో రోడ్డు ప్రారంభోత్సవం కార్యక్రమంలో టీఎంసీ నేత, కార్యకర్త హాజరయ్యారు. ఈ సందర్భంగా కాల్పులు జరిగాయి. ఇద్దరిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. గాయపడిన వారిలో ఒకరిని టీఎంసీ స్థానిక కమిటీ అధ్యక్షుడు బకుల్ షేక్‌గా గుర్తించినట్లు తెలిపారు. మాల్దాలోని టీఎంసీ కౌన్సిలర్ దులాల్ సర్కార్ జనవరి 2న హత్యకు గురయ్యారు. ఇందుకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
