15 నుంచి లోక్‌సభ తొలి సెషన్‌

  • కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం

ప్రజాశక్తి -న్యూఢిల్లీ బ్యూరో : ఈ నెల 15 నుంచి 18వ లోక్‌సభ తొలి సెషన్‌ ప్రారంభం కానుంది. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేస్తారు. రెండ్రోజుల పాటు ప్రమాణ స్వీకారం, ఆ తరువాత కొత్త స్పీకర్‌ను ఎన్నుకుంటారు. మరుసటిరోజు రాష్ట్రపతి లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. తద్వారా సెషన్‌ను అధికారికంగా ప్రారంభిస్తారు. సెషన్‌ తేదీలపై కొత్త కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశంలో ప్రధాని మోడీ తన మంత్రి మండలి సభ్యులను ఉభయ సభలకు పరిచయం చేస్తారు. ఈ నెల 22న సెషన్‌ ముగిసే అవకాశం ఉంది. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే కేబినెట్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గం సలహా మేరకు 17వ లోక్‌సభను జూన్‌ 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రద్దు చేశారు. బిజెపి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మోడీ ఎన్నికపై బిజెపి చీఫ్‌ జేపీ నడ్డా ఆమెకు లేఖ ఇవ్వడం, ఎన్‌డిఎ నాయకులు మద్దతు లేఖలు సమర్పించడంతో ముర్ము శుక్రవారం మోడీని ప్రధానిగా నియమించిన సంగతి తెలిసిందే.

➡️