యుపీలో రోడ్డు ప్రమాదం – ఐదుగురు వైద్యులు మృతి

Nov 27,2024 11:00 #road accident, #Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌ లోని ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్యులు మృతి చెందారు. మృతులు సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన పీజీ విద్యార్థులుగా గుర్తించారు. వైద్యులంతా లక్నో నుంచి ఆగ్రాకు స్కార్పియోలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వేగంగా ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వైద్యులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన మరో పీజీ విద్యార్థిని ఆస్పత్రిలో చేర్చారు.  ప్రాణాలు కోల్పోయిన వైద్యులను డాక్టర్ అనిరుద్ధ్ వర్మ, డాక్టర్ సంతోష్ కుమార్ మౌర్య, డాక్టర్ జైవీర్ సింగ్, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ నార్దేవ్‌లుగా గుర్తించారు.

 

➡️