మట్టి పెళ్లలు విరిగిపడి ఐదుగురు కార్మికులు మృతి

గుజరాత్‌ : మట్టి పెళ్లలు విరిగిపడటంతో ఐదుగురు కార్మికులు మృతి చెందిన ఘటన శనివారం గుజరాత్‌లో జరిగింది. మెహసానా జిల్లాలోని కడి పట్టణ సమీపంలో ఉన్న ఓ నిర్మాణ స్థలంలో జిల్లా కేంద్రానికి 37 కిలోమీటర్ల దూరంలోని జసల్‌పూర్‌ గ్రామంలో కార్మికులు భూగర్భ ట్యాంకు కోసం గొయ్యి తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఐదుగురు కార్మికులు మృతి చెందారు. ఘటనా స్థలానికి అధికారులు చేరుకున్నారు. సహాయకచర్యలు చేపట్టారు. కడి పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రహ్లాద్‌సిన్హ్‌ వాఘేలా మాట్లాడుతూ … మట్టిపెళ్లలు కూలిపోవడంతో పలువురు కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తోందన్నారు. ప్రస్తుతం ఐదుగురు కార్మికుల మృతదేహాలను బయటకు తీశామన్నారు. ముగ్గురికిపైగా కార్మికులు మట్టిపెళ్ళల్లో చిక్కుకున్నారని తెలుస్తోందన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. శిథిలాల కింద కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావటానికి అధికారులు కృషి చేస్తున్నారని వివరించారు.

➡️