ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ముంబై : ముంబై ఎక్స్‌ ప్రెస్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా 42 మందికి గాయాలు అయ్యాయి. కేసర్‌ నుంచి పంధర్‌పూర్‌కు వెళ్తుండగా ట్రాక్టర్‌ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ట్రాక్టర్‌ను ఢీకొని ప్రైవేటు బస్సు ఒక్కసారిగా లోయలో పడింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 42 మందిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️