నాగ్‌పూర్ : అల్యూమినియం ఫాయిల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి నాగ్‌పూర్‌లోని ఉమ్రేడ్‌లో జరిగింది. నాగ్‌పూర్ గ్రామీణ ఎస్పీ హర్ష్ పొద్దార్ తెలిపిన వివరాల ప్రకారం … నిన్న నాగ్‌పూర్ జిల్లాలోని ఉమ్రేడ్ తాలూకా వద్ద ఉన్న అల్యూమినియం ఫాయిల్ ఫ్యాక్టరీలో పాలిష్ చేసిన ట్యూబింగ్ యూనిట్‌లో 87 మంది కార్మికులు పనిచేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురు మరణించారు. ఎనిమిదిమందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ లోనికి వెళ్లడం కష్టంగా ఉందని, మంటలు అదుపులోకి వచ్చాక లోపల కూడా పరిశీలిస్తామని పోద్దార్ వివరించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
