దేశంలోనే తొలిసారిగా వృద్ధుల కోసం కేరళలో కమిషన్‌

తిరువనంతపురం : అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుండే కేరళ మరో ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా వృద్ధుల కోసం కమిషన్‌ ఏర్పాటు చేసేందుకు చట్టాన్ని ఆమోదించింది. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు పినరయి విజయన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ కొత్త కమిషన్‌ వృద్ధుల హక్కులు, సంక్షేమం, పునరావాసం, పరిరక్షణపై దృష్టి సారిస్తుందని చెప్పారు. ఈ కమిషన్‌ 2024 డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నిర్లక్ష్యం, దోపిడీ, ఒంటరితనం వంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ కమిషన్‌ ప్రాధాన్యతనిస్తుందని, ఈ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన మార్గదర్శకాలను అందించే బాధ్యత కూడా దీనిపై వుంటుందని విజయన్‌ తెలిపారు.

➡️