గుజరాత్: గుజరాత్‌లోని రాచరిక రాష్ట్రమైన జామ్‌నగర్‌గా పిలువబడే నవనగర్ తదుపరి జామ్ సాహెబ్ ను ప్రకటించారు. శనివారం దసరా సందర్భంగా మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను సింహాసనానికి వారసుడిగా ప్రకటించారు. ఈ విషయాన్ని నవనగర్ మహారాజా జామ్ సాహెబ్ ఒక ప్రకటనలో ధృవీకరించారు. 1992 మరియు 2000 మధ్యకాలంలో భారతదేశం తరపున 196 వన్ డేలు, 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జడేజా జామ్‌నగర్ రాజకుటుంబానికి చెందిన వారసుడు. జామ్‌నగర్ మహారాజా శత్రుసల్యాసిన్హ్ జడేజా దౌలత్‌సింగ్‌జీ జడేజా యొక్క బంధువు. 1971 నుండి 1984 వరకు జామ్‌నగర్ నుండి మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైయ్యారు.