జమ్మూ అండ్ కాశ్మీర్ : జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో సోమవారం మాజీ సైనికుడు మృతి చెందాడు. అతని కుమార్తె, భార్య గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మాజీ సైనికుడు మంజూర్ అహ్మద్ వాగే కుటుంబంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సంఘటన బెహిబాగ్ ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలపాలైన అహ్మద్ వాగీ మృతి చెందారు. అతని భార్య, కుమార్తెల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. పోలీసులు, పారామిలటరీ బలగాలు, ఆర్మీ బృందాలు.. ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రదేశాన్ని చుట్టుముట్టాయి అని మీడియా వెల్లడించింది.
