గౌహతి : అస్సాంలోని దిమా హసావో జిల్లాలో బొగ్గు గనిలో మంగళవారం తొమ్మిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. గనిలో లోపలికి వరద నీరు చేరి.. రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఆటంకంగా మారింది. అయినప్పటికీ సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తూనే ఉన్నాయి. శనివారం గని లోపల నుంచి నలుగురి మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికితీశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ బొగ్గు గనిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు మరొక మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బందికి వెలికితీశారు’ అని ఆయన పోస్టులో పేర్కొన్నారు.
కాగా, బుధవారం ఉదయం నేపాల్‌లోని ఉదరుపూర్ నివాసి అయిన గంగా బహదూర్ శ్రేష్టో మృతదేహాన్ని గనిలో నుంచి ఆర్మీ సిబ్బంది వెలికితీశారు. శుక్రవారం రాత్రి ఓ మైనర్ వయసు ఉన్న ఓ వ్యక్తి మృతదేహాన్ని వెలికితీసినట్లు అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎఎస్‌డిఎంఎ) సిఇఓ జిడి త్రిపాఠి అన్నారు.