సిమ్లా : సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చందారు. ఈ ఘటన మంగళవారం అర్థరాత్రి సమయంలో జరిగినట్లు పోలీసు అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ ఘటన సిమ్లా శివారులోని ఆనంద్‌పూర్ – మెహ్లి రోడ్డు లాల్‌పనీ వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. బండి అదుపుతప్పి లోయలో పడిపోవడంతో.. ఆ వాహనంలో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మృతులను రూపా సూర్యవంశీ (45), ఆమె కుమార్తె ప్రగతి (14), హెట్ రామ్ కుమారుడు ముకుల్ (10), జై సింగ్ నేగి (40), వీరందరూ సిమ్లాలోని నవ్ బహర్ నివాసితులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ (ఐజిఎంసి)కు తరలించారు.
