Mumbai : వాటర్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ నలుగురు మృతి

ముంబయి :   ముంబయిలో నిర్మాణంలో ఉన్న భవనంలో వాటర్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక నలుగురు కార్మికులు మరణించారు. నాగ్పాడలోని మింట్‌ రోడ్‌లో ఆదివారం ఈఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతులు  హసిపాల్‌ షేక్‌ (19), రాజా షేక్‌ (20), జియావుల్లా షేక్‌ (36), ఇమాండు షేక్‌ (38)లుగా  గుర్తించినట్లు  బృహన్‌ ముంబయి మునిసిపల్‌ కార్పోరేషన్‌ (బిఎంసి) ఒక ప్రకటనలో తెలిపింది. మరో కార్మికుడు పుర్హాన్‌ షేక్‌ (31)చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది.

➡️