encounter : కుల్గామ్‌ జిల్లాలోఎన్‌కౌంటర్‌

Sep 28,2024 22:45 #encounter, #Jammu and Kashmir, #Kulgam
  • ఇద్దరు తీవ్రవాదులు మృతి
  • ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

శ్రీనగర్‌ : జమ్ము కాశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తు తెలియని తీవ్రవాదులు మరణించగా, ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం నుండీ భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో జిల్లాలోని దేవ్‌సర్‌ ఏరియా అడిగమ్‌ గ్రామంలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. కాల్పులు ప్రారంభమైన వెంటనే అదనపు ఎస్‌పి (ట్రాఫిక్‌) ముంతాజ్‌ అలీకి బుల్లెట్‌ తగిలి స్వల్ప గాయమైంది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న మరో నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. ఇద్దరు తీవ్రవాదులు మరణించారని, వారెవరో, ఏ గ్రూపునకు చెందినవారో ఇంకా నిర్ధారించాల్సి వుందని పోలీసులు తెలిపారు. కతువా జిల్లా మారుమూల గ్రామంలో కూడా భద్రతా బలగాలు, తీవ్రవాదుల మధ్య స్వల్పంగా కాల్పులు జరిగాయి. వెంటనే బిల్వార్‌ ఏరియాలోని కోగ్‌ మండ్లి గ్రామానికి అదనపు బలగాలు పంపినట్లు అధికారులు తెలిపారు.

➡️