Congress : లోక్‌సభలో కాంగ్రెస ఉపనేతగా గౌరవ్‌ గొగోయ్, చీఫ్‌ విప్‌గా కె. సురేష్‌

న్యూఢిల్లీ :   లోక్‌సభలో పార్టీ ఉపనేతగా సీనియర్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌ని  కాంగ్రెస్‌ పార్టీ నియమించింది. విప్‌లుగా మాణికం ఠాగూర్‌, ఎం.డి. జువైద్‌, చీఫ్‌ విప్‌గా కె. సురేష్‌లను నియమించింది.  కాంగ్రెస్‌ పార్టీకి ఉపనేత, చీఫ్‌విప్‌, ఇద్దరు విప్‌ల నియామకం గురించి తెలియజేస్తూ పార్లమెంటరీ పార్టీ (సిపిపి) చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌ ఆదివారం ప్రకటించారు.

నూతనంగా నియమితులైన వారికి వేణుగోపాల్‌ అభినందనలు తెలిపారు. రాహుల్‌ గాంధీ మార్గనిర్దేశంతో, కాంగ్రెస్‌, ఇండియా ఫోరం పార్టీలు లోక్‌సభలో ప్రజల సమస్యలపై శక్తివంతంగా పోరాడతాయని ఎక్స్‌లో పేర్కొన్నారు.

➡️