ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జిఎస్‌టి తగ్గించాలి

Aug 6,2024 23:23 #parliment, #sessions

పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై ఉన్న 18 శాతం జిఎస్‌టిని తగ్గించాలని ప్రతిపక్ష ఇండియా ఫోరం పార్టీల సభ్యులు డిమాండ్‌ చేశారు. మంగళవారం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్‌ భవనం మకరద్వారం ముందు ‘టాక్స్‌ టెర్రరిజం’ ప్లకార్డులను ప్రదర్శించి, జిఎస్‌టి తగ్గించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆందోళనలో లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌, సిపిఎం ఎంపిలు జాన్‌ బ్రిట్టాస్‌, వి.శివదాసన్‌, అమ్రారామ్‌, రాధాకృష్ణన్‌, వెంకటేషన్‌, టిఎంసి, ఆప్‌, కాంగ్రెస్‌, ఎస్‌పి, ఆర్‌జెడి, డిఎంకె తదితర పార్టీల ఎంపిలు పాల్గన్నారు. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జిఎస్‌టి వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు.

➡️