Gujarat : అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

Apr 12,2025 12:04 #Ahmedabad, #Gujarat

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని ఓ రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌లో ఏడో అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో అందులోని నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలను దక్కించుకోవడానికి అపార్ట్‌మెంట్‌ నుంచి దూకారు. ఓ మహిళ ఎంతో ధైర్యంగా తన ఇద్దరు పిల్లల్ని స్థానికుల సహాయంతో కింద అపార్ట్‌మెంట్‌లోకి పంపింది. అలాగే తాను కూడా ఎంతో సాహసంతో కింద అపార్ట్‌మెంట్‌లోకి దూకింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటల్ని అదుపుచేశారు. అలాగే అపార్ట్‌మెంటులోని 18 మందిని సురక్షితంగా రక్షించారు. ఈ అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించలేదు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

➡️