Holi : ఐక్యతకు సందేశమిచ్చే హోలీ : రాష్ట్రపతి ముర్ము

Mar 14,2025 12:22 #Holi

న్యూఢిల్లీ : నేడు హోలీ పండుగ. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని మోడీ దేశ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘హోలీ రంగుల పండుగ. ఈ ఆనంద పండుగ ఐక్యత, ప్రేమ, సామరస్యం యొక్క సందేశాన్ని ఇస్తుంది. ఈ పండుగ భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం కూడా. ఈ పండుగ సందర్భంగా మనందరం కలిసి భారతమాత పిల్లలందరి జీవితాలను నిరంతర పురోగతి, శ్రేయస్సు, ఆనందాన్ని రంగులతో నింపుతామని ప్రతిజ్ఞ చేద్దాం’ అని ముర్ము సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా పోస్టు చేశారు.
కాగా, దేశ ప్రధాని మోడీ కూడా హోలి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, శక్తిని నింపుతుంది. దేశ ప్రజలలో ఐక్యతను మరింత పెంచే పండుగ ఇది అని మోడీ ఎక్స్‌ పోస్టులో తెలిపారు.

➡️