ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి.. ఐదు ఇళ్లు కుప్పకూలి..

Nov 29,2023 15:20 #cylinder blast, #Mumbai

 

ముంబయి : ముంబయిలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. చంబూరులోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో.. వరుసగా ఉన్న ఐదు ఇళ్లు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద అనేకమంది నివాసితులు చిక్కుకుపోయారు. ఈ ఘటన బుధవారం ఉదయం 8 గంటలకు గోల్ఫ్‌క్లబ్‌ సమీపంలోని ఓల్డ్‌ బారక్‌లో జరిగింది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఉన్న వారిలో 11 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. వీరిలో ఆరుగురిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరగడానికి గల కారణం తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. కాగా, వికాస్‌ ఆంబోర్‌ (50), అశోక్‌ ఆంబోర్‌ (27), సవితా అంభోర్‌ (47), రోహిత్‌ అంభోర్‌ (29), రాహుల్‌ కాంబ్లే (35), పార్థ్‌ సింగ్‌ (21)లు గాయపడ్డారని బిఎంసి అధికారి తెలిపారు.

➡️