న్యూఢిల్లీ : సిఎ ఫైనల్, ఇంటర్ రిజల్ట్స్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) గురువారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాల కోసం రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్‌లతో icai.nic.in. అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ కావాల్సిందిగా పేర్కొంది. ఫలితాలతో పాటు మెరిట్ లిస్ట్, టాపర్స్ పేర్లతో పాటు ఇతర వివరాలను కూడా వెల్లడించింది.
Direct link to check Final results
Direct link to check Inter results
ఐసిఎఐ సిఎ ఇంటర్ గ్రూప్ 1 పరీక్షలు మే 3,5 మరియు 9 తేదీలలో నిర్వహించగా, గ్రూప్ 2 పరీక్షలను మే 11,15 మరియు 17 తేదీలలో నిర్వహించింది. అలాగే సిఎ ఫైనల్ గ్రూప్ 1 పరీక్షలు మే 2,4 మరియు 8 తేదీలలో నిర్వహించగా, గ్రూప్ 2 పరీక్షలను మే 10,14, మరియు 16 తేదీలలో జరిగాయి. ఇంటర్నేషనల్ టాక్సేషన్ అసెస్‌మెంట్ పరీక్ష మే 14,16 తేదీలలో జరిగింది.