రాజ్‌ కుంద్ర నివాసంలో ఇడి సోదాలు

Nov 30,2024 00:05 #ED, #Raj Kundra's residence, #searches

ముంబయి : బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్ర నివాసంతో పాటు అతనికి చెందిన 15 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) గురువారం సోదాలు నిర్వహించింది. రాజ్‌కుంద్రపై నమోదైన పోర్నోగ్రఫీ కేసు, మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణలో భాగంగా ఇడి ఈ సోదాలు నిర్వహించింది. 2021లో రాజ్‌కుంద్రాపై ముంబయి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈ మనీలాండరింగ్‌ కేసును ఇడి నమోదు చేసింది. పోర్నోగ్రఫీ రాకెట్‌ను కుంద్రా నిర్వహిస్తున్నాడనే అభియోగాలు ఉన్నాయి. కుంద్ర రూపొందించిన ఫోర్న్‌ వీడియోలను వివిధ యాప్స్‌కు విక్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

➡️