బిజెపి గెలిస్తే అమిత్‌ షా ప్రధాని.. యోగి అవుట్‌…

May 17,2024 00:45 #Amit Shah, #Arvind Kejriwal
  •  ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : ఒకవేళ కేంద్రంలో బిజెపి విజయం సాధిస్తే అమిత్‌ షా ప్రధాని అవుతారనీ, యోగిని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తారని ఆప్‌ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ”ఇండియా బ్లాక్‌కు ఓటు వేయాలని ఉత్తర ప్రదేశ్‌ ఓటర్లను అభ్యర్థించటానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను నాలుగు అంశాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిది, ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ అమిత్‌ షాను ప్రధానిని చేయడానికి ఓట్లను అడుగుతున్నారు. రెండోది, ఒకవేళ బిజెపి అధికారంలోకి వస్తే, యోగిని తన పదవి నుంచి రెండు, మూడు నెలల్లో తొలగిస్తారు. మూడోది, వారు (బిజెపి) రాజ్యాంగాన్ని మార్చనున్నారు. ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లు రద్దవుతాయి. నాలుగోది, ‘ఇండియా’ బ్లాక్‌ అధికారంలోకి రాబోతున్నది” అని కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన కేజ్రీవాల్‌.. ఆప్‌తోపాటు ఇండియా బ్లాక్‌ పార్టీలకు మద్దతుగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్న విషయం విదితమే.

➡️