Henley Passport Index : 85వ ర్యాంక్‌లో భారత్‌ ..

న్యూఢిల్లీ :   ప్రపంచ పాస్‌పోర్ట్‌ సూచీలో భారత్‌ ర్యాంకింగ్‌ ఈ ఏడాది ఐదు పాయింట్లు తగ్గి 85వ స్థానానికి పడిపోయింది. గతేడాది ఈ సూచీలో భారత్‌ ర్యాంకింగ్‌ ప్రపంచవ్యాప్తంగా 80వ స్థానంలో ఉంది. 2006-2025 మధ్య డాటా పరిశీలిస్తే భారత్‌ 2021లో అతి తక్కువగా 91, 2021లో అత్యధికంగా 71వ ర్యాంక్‌ పొందింది. సింగపూర్‌ వరుసగా రెండవ సంవత్సరం కూడా అగ్రస్థానంలో నిలిచింది. పౌరసత్వ సలహా సంస్థ హెన్లీ అండ్‌ పార్టనర్స్‌ బుధవారం హెన్లీ పాస్‌పోర్ట్‌ సూచీని విడుదల చేసింది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఐఎటిఎ) సమాచారం ఆధారంగా ఈ సూచీని రూపొందించింది.

2025 సూచిక ప్రకారం.. భారత్‌ 85వ స్థానంలో ఉండగా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు వరుసగా 103,100వ స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు దేశాలు వరుసగా 101, 97వ స్థానాల్లో ఉన్నాయి. జపాన్‌ 2, అమెరికా 9,కెనడా 7 స్థానాల్లో నిలిచాయి.

అయితే వీటన్నింటికీ విరుద్ధంగా గత దశాబ్దంలో చైనా అత్యధిక సందర్శకుల  దేశాల్లో ఒకటిగా నిలిచింది. 2015లో 94వ స్థానం నుండి 2025లో 60వ స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో వీసా రహిత దేశాల జాబితా 40కి పెరిగింది. గత 10 ఏళ్లుగా పాస్‌పోర్ట్‌ సూచీలో ర్యాంకింగ్‌ల్లో క్షీణిస్తూ వస్తున్న మొదటి ఐదు దేశాలుగా వెనిజులా, అమెరికా, వనౌతు, బ్రిటన్‌, కెనడాలు నిలిచాయి.

➡️