SAR: అకడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో పడిపోయిన భారత్ ర్యాంక్

Oct 10,2024 13:47 #global ranking, #Universities

ఢిల్లీ : అకడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారతదేశ స్థానం బాగా పడిపోయింది. 2013 నుండి 2023 వరకు విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలకు సంబంధించిన డేటాను సేకరించిన స్కాలర్స్ ఎట్ రిస్క్ (ఎస్.ఎ.ఆర్) విడుదల చేసిన ‘ఫ్రీ టు థింక్ 2024’ నివేదికలో భారతదేశం యొక్క స్థానం మారిపోయింది. ఎస్.ఎ.ఆర్ అనేది ప్రపంచంలోని 665 విశ్వవిద్యాలయాలను అనుసంధానించే వ్యవస్థ. భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, చైనా, కొలంబియా, జర్మనీ, హాంకాంగ్, ఇరాన్, ఇజ్రాయెల్, నికరాగ్వా, నైజీరియా, పాలస్తీనా, రష్యా, టర్కీ, సూడాన్, ఉక్రెయిన్, యుకె మరియు యుఎస్ వంటి దేశాలలోని విశ్వవిద్యాలయాలను నివేదికలో భాగంగా విస్తృతంగా పరిశీలించారు. 51 దేశాల్లోని ఉన్నత విద్యా సంస్థలలో జూలై 1, 2013 నుండి జూన్ 30, 2024 వరకు జరిగిన హింసను కూడా ఫ్రీ టు థింక్ నివేదిక వివరిస్తుంది.

2013 నుండి 2023 వరకు,  అకడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారతదేశం యొక్క స్కోరు 0.6 నుండి 0.2కి పడిపోయింది. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి తన పాలనలో భాగంగానే యూనివర్శిటీలను తమ ప్రభావంలోకి తెచ్చేందుకు, విద్యాసంస్థల్లో హిందూత్వ ఎజెండాను రుద్దేందుకు చేయడం వలనే స్కోర్ తగ్గిందని నివేదిక పేర్కొంది. 1940 మధ్యకాలం తర్వాత భారత్ ర్యాంకింగ్స్‌లో ఇంత దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి.

కేరళ గవర్నర్ ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్ ఆ రాష్ట్ర యూనివర్సిటీల్లో చేసిన జోక్యాలను కూడా నివేదిక ప్రస్తావించింది. ఇతర రాష్ట్రాల్లోని ఇలాంటి సమస్యలు, జేఎన్‌యూ సహా యూనివర్సిటీల్లో విద్యార్థుల సమ్మెలు కూడా నివేదికలో ఉన్నాయి.

➡️