ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండిస్టియల్‌ స్మార్ట్‌ సిటీలు మంజూరయ్యాయి : కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

న్యూఢిల్లీ : ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండిస్టియల్‌ స్మార్ట్‌ సిటీలు మంజూరయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలో రామ్మోహన్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ … ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండిస్టియల్‌ స్మార్ట్‌ సిటీలు మంజూరు అయినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌-బెంగళూరు, విశాఖ-చెన్నై కారిడార్లు అభివఅద్ధి చేస్తామన్నారు. పోలవరానికి రూ.12 వేల కోట్లు ఇవ్వడానికి త్వరలో ఒప్పందం జరగనుందని, ఏపీకి వివిధ రకాల పరిశ్రమలు రావడానికి కేంద్రం సాయం చేస్తోందని వివరించారు.

➡️