శ్రీనగర్ : ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోరుతూ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో శుక్రవారం కూడా బిజెపి ఎమ్మెల్యేలు తమ ఆందోళన కొనసాగించారు. 12 మంది బిజెపి ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకురావడంతో స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాధర్ ఆదేశాల మేరకు వారిని మార్షల్స్ బయటకు పంపారు. దీనికి నిరసనగా సభలో ఉన్న మరో 11 మంది బిజెపి ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆర్టికల్ 370పై తీర్మానాన్ని ఉపసంహరించుకునే వరకూ అసెంబ్లీని సాగనివ్వబోమని చెప్పారు.