జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

Jun 9,2024 11:21 #JEE Advanced Results, #released

ఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 26న జరిగిన ఈ పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల విడుదల చేసిన ఐఐటీ మద్రాస్‌.. తాజాగా తుది కీ, జెఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను ప్రకటించింది.
దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించిన ఈ పరీక్షను దాదాపు 2 లక్షల మంది రాయగా.. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది వున్నారు. బీటెక్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్‌), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా పేరిట సంయుక్తంగా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్‌ 10 నుంచి జులై 23 వరకు కొనసాగనుంది.

➡️