న్యూఢిల్లీ : దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ (మెయిన్) తొలి విడత పరీక్ష ఫైనల్ కీ సోమవారం విడుదలయ్యింది. జనవరి 22 నుంచి 29 వరకు నిర్వహించిన పేపర్- 1 పరీక్ష కీ ని ఎన్‌టీఏ అధికారులు నేడు రిలీజ్ చేశారు. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్‌లను విడుదల చేసి ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించిన తరువాత … తాజాగా ఫైనల్ కీ ని అందుబాటులోకి తెచ్చారు. జేఈఈ మెయిన్ సంబంధించిన ఫైనల్ కీ నుంచి అన్ని సెషన్లు కలిపి మొత్తంగా 12 ప్రశ్నల్ని విరమించుకుంటున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ఆయా ప్రశ్నలకు గాను విద్యార్థులకు ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున కలపనున్నారు. డ్రాప్ అయినవాటిలో అత్యధిక ప్రశ్నలు ఫిజిక్స్ నుంచే ఉండటం గమనార్హం. జేఈఈ మెయిన్ ఫలితాలను ఫిబ్రవరి 12 నాటికి విడుదల చేయనున్నట్లు ముందుగా వెల్లడించినప్పటికీ త్వరలోనే పర్సంటైల్ స్కోరును వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
జేఈఈ (మెయిన్) తొలి విడత పరీక్ష ఫైనల్ కీ కోసం కింది లింక్ పై క్లిక్ చేయగలరు..
https://cdnbbsr.s3waas.gov.in/s3f8e59f4b2fe7c5705bf878bbd494ccdf/uploads/2025/02/2025021039.pdf
డ్రాప్ అయిన ప్రశ్నల ఐడీలు …
ఫిజిక్స్ : 656445270, 7364751025, 656445566, 6564451161, 656445870, 7364751250, 564451847, 6564451917
కెమిస్ట్రీ: 656445728, 6564451784
మ్యాథమెటిక్స్: 6564451142, 6564451898