జేఈఈ మెయిన్ సెష‌న్ -1 తుది కీ విడుద‌ల‌

Feb 12,2024 17:09 #answer, #JEE, #key

న్యూఢిల్లీ : దేశంలోని ప్ర‌తిష్ఠాత్మ‌క విద్యాసంస్థ‌ల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించిన జేఈఈ మెయిన్ తొలి విడత ప‌రీక్ష‌ల తుది కీ విడుద‌లైంది. జ‌న‌వ‌రి 24 నుంచి ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌ల‌ను ఎన్టీఏ(నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్వ‌హించింది. ఇవాళ తుది కీని విడుద‌ల చేసింది. త్వ‌ర‌లోనే ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నుంది. జ‌న‌వ‌రి 24 నుంచి ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన జేఈఈ మెయిన్ సెష‌న్-1 ప‌రీక్ష‌ల‌కు 12,95,617 మంది రిజిస్ట్రేష‌న్ చేసుకోగా, 12,25,529 మంది హాజ‌ర‌య్యారు. తుది కీ కోసం https://jeemain.nta.ac.in./ అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు. లేదా ఈ లింక్‌పై క్లిక్‌ చేసి జేఈఈ మెయిన్ సెష‌న్ -1 తుది కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..

➡️