జేఈఈ మెయిన్స్‌ రెండో సెషన్‌ ఫలితాలు విడుదల

Apr 25,2024 08:58 #2024 JEE Mains results, #released

ఢిల్లీ : జేఈఈ మెయిన్స్‌ రెండో సెషన్‌ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. రెండు సెషన్లకు కలిపి ఎన్‌ టీఏ ర్యాంకులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎన్‌టీఏ ఎంపిక చేసింది. కేటగిరీల వారీగా ఎన్‌టీఏ కటాఫ్‌ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 56 మందికి వంద పర్సంటైల్‌ స్కోరు రాగా తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురికి వంద పర్సంటైల్‌ స్కోరు దక్కింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఈ నెల 27 నుంచి మే 7 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగనుంది.

ఇక్కడ నేరుగా ఒక్క క్లిక్‌తో చెక్‌ చేసుకోండి

https://jeemainsession2.ntaonline.in/frontend/web/scorecard/index

➡️