మంత్రి పదవికి రాజీనామా చేసిన జార్ఖండ్‌ నేత ఆలంగీర్‌ ఆలం

రాంచీ :    మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన జార్ఖండ్‌ నేత ఆలంగీర్‌ ఆలం మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ పక్షనేత పదవికి కూడా రాజీనామా చేశారు. అలంగీర్‌ ఆలం రాజీనామా చేసినట్లు జార్ఖండ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ రాజేశ్‌ ఠాకూర్‌ నిర్ధారించారు. ఆలంగీర్‌ నుండి అన్ని మంత్రి పదవులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంపాయి సోరెన్‌ తీసుకున్న మూడు రోజుల అనంతరం ఆయన రాజీనామా చేశారు. ఆలంగీర్‌ గ్రామీణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు, గ్రామీణ పనులు, పంచాయితీ రాజ్‌ వంటి నాలుగు శాఖలను నిర్వహించేవారు.

మనీలాండరింగ్‌ కేసులో గత నెల 15న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఆలంగీర్‌ను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. మే 6 అలంగీర్‌ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌ లాల్‌ పని మనిషి జహంగీర్‌ ఆలం ఇంట్లో ఇడి సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో సుమారు రూ. 37 కోట్ల భారీ నగదు పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలంగీర్‌ ఆలంతోపాటు సంజీవ్‌ లాల్‌ను కూడా ఇడి అదుపులోకి తీసుకుంది.

➡️