జార్ఖండ్‌ మంత్రి అలంగిర్‌ అరెస్టు

రాయ్ పూర్‌ : ఒక మనీలాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు అలంగిర్‌ అలంను ఇడి బుధవారం అరెస్టు చేసింది. ఈ కేసులో 70 ఏళ్ల మంత్రి అలంను వరసగా రెండో రోజు బుధవారం ఆరు గంటల పాటు ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసినట్లు సమాచారం. మంగళవారం కూడా మంత్రిని ఇడి తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. గతవారంలో మంత్రి పనిమనిషి జహంగీర్‌ ఆలం ఇంటి నుంచి రూ 32 కోట్ల నగదును ఇడి స్వాధీనం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే జహంగీర్‌ను, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌ కుమార్‌ లాల్‌ను ఇడి అరెస్టు చేసింది. కస్టడీ కోరుతూ పిఎంఎల్‌ఎ కోర్టులో హాజరు పరిచింది. బుధవారం అరెస్టయిన అలం 2000లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. స్పీకర్‌గా కూడా పనిచేశారు.

➡️