జార్ఖండ్‌ మంత్రికి ఆరు రోజుల కస్టడీ

May 17,2024 00:38 #jarkhand, #minister

రాంచీ : జార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్‌ ఆలంకు పిఎంఆర్‌ఎ కోర్టు ఆరు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. మనీలాండరింగ్‌్‌ కేసులో అలంగీర్‌ ఆలంను ఇడి బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక పిఎంఎల్‌ఎ ప్రభాత్‌ కుమార్‌శర్మ కోర్టు ముందు మంత్రిని గురువారం ఇడి హాజరుపర్చింది. ఆలం తన శాఖలో అమలు చేయబడిన ప్రతి టెండర్‌ నుంచి 1.5 శాతం కమిషన్‌ వసూలు చేసేవారని ఇడి ఆరోపించింది. ఈ నెల 6న ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌ కుమార్‌ లాల్‌, మంత్రి ఇంటి పని మనిషి జహంగీర్‌ ఆలమ్‌ ప్లాట్లలో జరిపిన దాడుల్లో రూ.37.5 కోట్లు స్వాధీనం చేసుకుని, వారిని అరెస్టు చేసినట్లు కోర్టుకు తెలిపింది. మంత్రి సూచనలు మేరకే ఈ నగదు వారు సేకరించినట్లు పేర్కొంది. మంత్రి అలంగీర్‌ ఆలంకు ఆరు రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ శుక్రవారం నుంచి ప్రారంభం అవుతుందని మంత్రి తరుపున న్యాయవాది కిష్లే ప్రసాద్‌ విలేకరులకు తెలిపారు. కోర్టు దృష్టికి 70 ఏళ్ల మంత్రి ఆరోగ్య పరిస్థితిని న్యాయవాది తీసుకుని వచ్చారు. రిమాండ్‌ కాలంలో అవసరమైన వైద్య సహాయం అందజేస్తామని కోర్టు హామీ ఇచ్చింది.

➡️