న్యూఢిల్లీ : ఇరాన్ రాయబారితో సెమినార్ ఆహ్వానించారన్న కారణంతో కో ఆర్డినేటర్ డా.సిమాబైద్యను జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) విధుల నుండి బుధవారం తొలగించింది. డా. సిమా బైద్య స్థానంలో జూనియర్ సహోద్యోగిని నియమిస్తున్నట్లు సెంటర్ ఫర్ ఏషియన్ స్టడీస్ (ఎస్‌ఐఎస్) చైర్‌పర్సన్ సమాచారం పంపారు. డా. బైద్య స్థానంలో డా.వృషల్ టి. ఘోబ్లే విధులు చేపట్టాల్సిందిగా సమాచారం పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తక్షణమే సెమినార్‌లను నిర్వహంచే బాధ్యతలను తీసుకోవాల్సిందిగా డా. ఘోబ్లేకు ఒక్క లైన్‌లో పంపిన సందేశంలో ఆదేశించినట్లు పేర్కొన్నాయి.
డా. బైద్య సిడబ్ల్యుఎఎస్ సహోద్యోగులకు, విద్యార్థులకు ఈ నెల 22 ఓ మెయిల్ పంపారు. సెమినార్‌లో పశ్చిమాసియాలో ” ఇటీవలి పరిణామాలను ఇరాన్ ఎలా చూస్తుంది” అనే అంశంపై భారత్‌లో ఇరాన్ రాయబారి డా.ఇరాజ్ ఇలాహి ప్రసంగించనున్నారని పేర్కొన్నారు.
సిడబ్ల్యుఎఎస్ ఫ్యాకల్టీ సభ్యులు, అంతర్జాతీయ వ్యవహారాలపై ప్రత్యేక పరిశోధనలు నిర్వహించే పలు కేంద్రాలను కలిగి ఉన్న సంస్థ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (ఎస్‌ఐఎస్) సభ్యులతో అంతర్గత చర్యలు జరిపినట్లు సమాచారం. అయితే చర్చలతో పరిస్థితి తీవ్రంగా మారవచ్చని సూచిస్తూ ఇరాన్ రాయబారి పాల్గననున్న ఈ సెమినార్‌ను రద్దు చేయాల్సిందిగా డా.బైద్యను ఆదేశించారు. ఇవే కాకుండా పాలస్తీనియన్, లెబనాన్ రాయబారులు పాల్గనే మరో రెండు సెమినార్‌లు కూడా రద్దయ్యాయి. ఆవెంటనే సెమినార్ కో ఆర్టినేటర్‌ను డా. సిమా బైద్య విధుల నుండి తొలగించినట్లు ఎస్‌ఐఎస్ డీన్ అమితాబ్ ఆదేశించారు.