న్యూఢిల్లీ : బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య ఎస్‌యూవీ కారును ఈ నెల 19వ తేదీన దొంగలెత్తుకుపోయారు. దక్షిణ తూర్పు ఢిల్లీలో గోవింద్ పురి ప్రాంతంలో ఉన్న సర్వీసింగ్ సెంటర్‌కు కారును ఇచ్చి డ్రైవర్ తినడానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా సర్వీస్ సెంటర్‌లో కారు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా కారు గురుగ్రామ్ వైపు వెళుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. తెల్లని రంగు ఫార్చూనర్ కారు దొంగతనానికి గురయ్యిందని ఫిర్యాదులో డ్రైవర్ జోగిందర్ పేర్కొన్నారు. కారు హిమాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉంది. కారు నంబర్ హెచ్‌పీ 03 డీ 0021 అని ఫిర్యాదులో డ్రైవర్ వెల్లడించారు. కారు ఎక్కడ ఉందో కనుగొనేందుకు పోలీసులు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
