- 18 నుంచి 3 రోజులపాటు చర్చలు
న్యూఢిల్లీ : వక్ఫ్ (సవరణ) బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఈనెల 18 నుంచి మూడు రోజులపాటు సంబంధిత వ్యక్తులు, సంస్థలు, వర్గాలతో సమావేశం కానున్నదని అధికారిక వర్గాలు తెలిపాయి. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులు ఈనెల 18న కమిటీ ముందు ఓరల్ ఎవిడెన్స్‌ను సమర్పించనున్నారు. తర్వాతి రోజు, జెపిసి వివిధ వర్గాలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు, ప్రతిపాదనలను వింటుంది. కమిటీకి అభిప్రాయాలు తెలిపే వారిలో పాట్నాలోని చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ ఉప సంచాలకులు ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తాఫా, పసమంద ముస్లిం మహాజ్, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్‌లు ఉన్నాయి. 20న ఆలిండియా సజ్జదానశిన్ కౌన్సిల్(అజ్మీర్), ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఢిల్లీ), భారత్ ఫస్ట్(ఢిల్లీ) ల నుంచి ఇన్‌పుట్‌లను కమిటీ కోరనున్నది.